పిల్లలమర్రి పరమశివునికి ఘనంగా భస్మాభిషేకం
సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి శివాలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం సందర్భంగా రెండు శివాలయాల్లో ఉన్న బ్రహ్మసూత్ర శివలింగాలకి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు.