VIDEO: ఐకేపీ కేంద్రంలో నిధుల కోత.. రైతుల ఆందోళన

VIDEO: ఐకేపీ కేంద్రంలో నిధుల కోత.. రైతుల ఆందోళన

సూర్యాపేట మండలంలోని సోలిపేట ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు మండిపడుతున్నారు. నిబంధనల పేరుతో జానమ్మ ఖాతాలో రూ.18 వేలు, విష్ణు ఖాతాలో రూ.10,500 కోత విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన పంటకు రావాల్సిన నిధులను తగ్గించడం అన్యాయమని, కలెక్టర్ తేజస్ వెంటనే విచారణ జరిపి తమకు న్యాయం చేయలని కోరారు.