జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ

TG: GHMC ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం స్పష్టం చేశారు. KPHB నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై నాయకులు దృష్టి సారించాలని రాష్ట్ర ఇన్‌ఛార్జి వేమూరి శంకర్ గౌడ్ పేర్కొన్నారు. ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.