కంటోన్మెంట్ బోర్డు విలీనం పై కొనసాగుతున్న ఫైర్
MDCL: కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని అక్కడి ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే లక్ష సంతకాల సేకరణ జోరుగా సాగుతోంది. గత నాలుగు రోజులుగా మల్కాజ్‌గిరి బార్డర్ లైన్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాల్లో యువత భారీ సంఖ్యలో పాల్గొన్నట్లుగా కార్యనిర్వాహకులు తెలియజేశారు. అందరూ ఇందులో పాల్గొనాలని కోరుతున్నారు.