వ్యభిచార గృహంపై పోలీసులు దాడి

వ్యభిచార గృహంపై పోలీసులు దాడి

ప్రకాశం: మార్కాపురం జిల్లా కేంద్రంలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని కాలేజీ రోడ్డులో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం మేరకు దాడి నిర్వహించినట్లు ఎస్సై సైదు బాబు తెలిపారు. సంబంధిత ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడతామని తెలియజేశారు.