గుంతలో పడి సింగరేణి కార్మికుడు మృతి
MNCL: శ్రీరాంపూర్ జాతీయ రహదారి సమీపంలోని సులభ్ కాంప్లెక్స్ వద్ద మోటర్ సైకిల్ అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడిపోవడంతో సింగరేణి కార్మికుడు మాడుగుల రమేష్ (34) మృతి చెందారు. ఆర్కే 7 గనిలో లైన్ మెన్ గా పనిచేస్తున్న రమేష్, విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావంతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.