హత్యకు దారి తీసిన అనుమానం
SRD: జహీరాబాద్ మండలంలో వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. కవిత (29)ను భర్త సిద్ధారెడ్డి హత్య చేశాడని తెలిపారు. వివాహేతర సంబంధం పెట్టుకుని మార్చి 27న ప్రియుడితో వెళ్లిపోయిందనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.