పురుగులమందు తాగి యువతి ఆత్మహత్యాయత్నం
అన్నమయ్య: బి. కొత్తకోట మండలం జరప్పల్లి గ్రామానికి చెందిన చైత్ర (26) అనే యువతి, కుటుంబ సమస్యలతో మనస్థాపానికి గురై ఇంట్లో పురుగులమందు తాగి ఇవాళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు.