ట్యాంక్ బండ్‌పై ఓంకార్ విగ్రహం పెడతాం: సీతక్క
TG: సురవరం ప్రతాప్ రెడ్డి, గద్దర్, అందెశ్రీ వంటి ప్రముఖుల చరిత్రతో సహా.. ఓంకార్ సేవలనూ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సీతక్క తెలిపారు. అలాగే ట్యాంక్‌బండ్‌పై ఓంకార్ విగ్రహం ఏర్పాటుపై సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఓంకార్ ఉన్నత విలువలు కలిగిన నాయకుడని, ప్రజా ఉద్యమాల్లో ఆయన పాత్ర విశేషమని గుర్తుచేశారు.