జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత

జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత

MBNR: జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సల్కర్‌పేట 41.3, దేవరకద్ర 41.2, మహమ్మదాబాద్ 41.1 డిగ్రీలు నమోదయ్యాయి. వడ్డేమాన్ 41.0, అడ్డాకుల 40.8, పారుపల్లి, సిరి వెంకటపూర్ 40.5, నవాబుపేట, మహబూబ్‌నగర్ అర్బన్‌లో 40.1 డిగ్రీలు నమోదయ్యాయి.