VIDEO: నిజామాబాద్‌లో ముమ్మరంగా వాహన తనిఖీలు
నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. బుధవారం రాత్రి నగరంలోని పలు కూడళ్లలో తనిఖీలు నిర్వహించి, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదని అధికారులు అసహనం వ్యక్తం చేశారు.