ఆమెకు నేను లెటర్ ఇవ్వలేదు: సోమిరెడ్డి

NLR: శ్రీకాంత్‌కు పెరోల్ ఇవ్వడానికి తాను రెఫరెన్స్ లెటర్ ఇవ్వలేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చెప్పారు. ‘ఓ మహిళ నా ఆఫీసుకు వచ్చి శాలువా కప్పి తన భర్త పెరోల్‌కు సిఫార్సు లేఖ ఇవ్వాలని కోరింది. వేరే నియోజకవర్గ విషయంలో జోక్యం చేసుకోనని చెప్పడంతో వెళ్లిపోయింది. అతడి నేరచరిత్రపై ఆరా తీశా. తర్వాత మరో 3సార్లు ఆమె నా ఆఫీసుకు వచ్చినా లెటర్ ఇవ్వలేదు.