ఉరేసుకుని నవ వధువు మృతి

ఉరేసుకుని నవ వధువు మృతి

ATP: తాడిపత్రిలో విషాదం నెలకొంది. లక్ష్మీ ప్రసన్న (30) అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు 20 రోజుల క్రితమే కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాకు చెందిన విజయ్ కుమార్‌తో వివాహం జరిగింది. పెళ్లైన కొద్దిరోజులకే ఈ ఘోరానికి ఒడిగట్టడం స్థానికంగా కలకలం రేపింది. లక్ష్మీ ప్రసన్న డిప్రెషన్‌తోనే బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.