విద్యార్థుల తల్లిదండ్రులకు టీచర్స్ ఆహ్వనం
ప్రకాశం: కంభం మండలంలో శుక్రవారం మెగా పేరెంట్-టీచర్ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్ఆర్ తురిమెళ్ల ప్రాథమిక పాఠశాల HM భాస్కర్ గురువారం ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రికలు అందించారు. తల్లిదండ్రులందరూ తప్పక రావాలని కోరారు. పేరెంట్స్ కమిటీలు, తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థుల సమగ్ర ప్రగతిని ప్రతిబింబించేలా పండగ వాతావరణంలో సమావేశం నిర్వహిస్తామని HM భాస్కర్ నాయుడు తెలిపారు.