అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

KMR: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అర్హులైన ఎస్సీ విద్యార్థులు 'అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి' పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూలు కులాల అభివృద్ధి అధికారి వెంకటేష్ తెలిపారు. ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 31వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.