IND vs SA తొలి టెస్ట్.. టాస్ ఓడిన భారత్
కోల్‌కతా ఈడెన్స్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ టాస్ ఓడింది. దీంతో పర్యాటక జట్టు కెప్టెన్ టెంబా బవుమా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా 2010 నాగ్‌పూర్ టెస్టులో విజయం సాధించిన సౌతాఫ్రికా ఆ తర్వాత భారత గడ్డపై వరుసగా ఓడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది.