'పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం'

JN:పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. కొడకండ్ల మండలంలోని రైతువేదికలో సోమవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 41 మంది లబ్దిదారులకు రూ. 41,04,756 విలువైన కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్, 21 మందికి రూ. 10,62,500 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు.