అప్రకటిత విద్యుత్ కోతలతో అవస్థలు
SRPT: హుజూర్‌నగర్‌లో గత కొన్ని రోజులుగా అప్రకటిత విద్యుత్ కోతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎండల తీవ్రతకు తోడు కరెంటు లేకపోవడంతో ఇళ్లలో ఉక్కపోత పెరిగి చిన్నారులు అస్వస్థతకు లోనవుతున్నారు. రాత్రిపూట కూడా సరఫరా నిలిచిపోతుండటంతో ప్రజలు నిద్రలేక అవస్థలు పడుతున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.