VIDEO: అపార్ట్‌మెంట్‌లో తాచుపాము కలకలం

VIDEO: అపార్ట్‌మెంట్‌లో తాచుపాము కలకలం

కోనసీమ: అమలాపురంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో మంగళవారం తాచుపాము ప్రత్యక్షమవడంతో నివాసితులు వణికిపోయారు. లిఫ్ట్ కింది భాగంలో పాముని గుర్తించిన స్థానికులు వెంటనే భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్‌కు సమాచారం అందించారు. ఆయన సత్వరమే సంఘటనా స్థలానికి చేరుకుని నైపుణ్యంగా పాముని పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు.