VIDEO: శనేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
CTR: పుంగనూరు మండలం దండుపాళ్యం గ్రామ సమీపంలోని శనీశ్వర స్వామి శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు స్వామివారి శిలా విగ్రహానికి తైలాభిషేకాలు, ఫల పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి, విశేష పూజలు చేపట్టారు. విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.