వివాహేతర బంధం.. మహిళ దారుణ హత్య
RR: షాద్‌నగర్ శివారులో దారుణ హత్య జరిగింది. ఫరూఖ్ నగర్ మండలం రంగారెడ్డిగూడలోని వివాహిత శోభారానికి అదే గ్రామానికి చెందిన వ్యక్తితో అక్రమసంబంధం ఏర్పడడంతో కుటుంబంలో గొడవలు జరిగాయి. దీంతో ఆగ్రహానికి గురైన భర్త నిన్న రాత్రి అత్యంత దారుణంగా చంపి చెట్ల పొదల్లో పడేశాడు. ఇవాళ ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.