కట్నం తిరిగిచ్చేసిన వరుడు

కట్నం తిరిగిచ్చేసిన వరుడు

వరకట్నాన్ని తిరస్కరించి ఓ వరుడు తన మంచి మనసును చాటుకున్నాడు. వివాహ సందర్భంగా అత్తామామలు ఇచ్చిన రూ.31 లక్షల కట్నాన్ని వాళ్లకే తిరిగి ఇచ్చేసి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. ఈ సంఘటన హర్యానాలోని కురుక్షేత్రలో జరిగింది. యూపీకి చెందిన వికాస్ రాణా అనే న్యాయవాదికి కురుక్షేత్రకు చెందిన అగ్రికా తన్వర్‌తో పెళ్లి కుదిరింది. తనకు కట్నం వద్దని, వధువే కట్నమని వికాస్ తెలిపాడు.