నరసన్నపేటలో పందులు స్వైర విహారం

నరసన్నపేటలో పందులు స్వైర విహారం

SKLM: నరసన్నపేట మేజర్ పంచాయతీ పరిధిలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. గాంధీనగర్, మారుతినగర్ ప్రాంతాలలో వీటి సంచారం అధికంగా ఉందని స్థానికులు తెలియజేశారు. పందులు విచ్చలవిడిగా సంచరించడంతో దోమల వ్యాప్తి అధికమై ప్రజలు జ్వరాలు బారిన పడుతున్నారు. పట్టణంలోని అన్ని వీధులలో సంచారం అధికమైందని, పిల్లలు, పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.