'పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి'
SRCL: పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి వాటిని త్వరిత గతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, వేములవాడ అడిషనల్ ఎస్పీ శేషాద్రి రెడ్డి అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను ఆమె తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలోని రౌడీ హిస్టరీ షీట్స్ వారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంచి, దొంగతనాల నివారణకు పెట్రోలింగ్ చేయాలని సూచించారు.