'శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి సహకరిస్తా'
KDP: శ్రీ రాముడి ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తానని కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పులివెందులలోని స్థానిక భాకరాపురం జయమ్మ కాలనీలో నిర్మిస్తున్న శ్రీ రాముడి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరాముని గుడి నిర్మిస్తుండటం శుభ పరిణామమని, శ్రీ రాముడి ఆశీస్సులతో కాలనీ వాసులందరికీ మంచి జరుగుతుందన్నారు.