ఆగస్టు 9న గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రావణ ఉపకర్మ

తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 9న శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు గోవిందరాజస్వామివారు, కృష్ణ స్వామివారిని కపిలతీర్ధంలోని ఆళ్వార్తోర్ధంకు తీసుకెళ్లి స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు మాడ వీధిలోని వైఖానసాచార్యులు ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు.