కాళోజి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజీనామా
WGL: కాళోజి హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రాజీనామా చేశారు. పేపర్ మూల్యాంకనంలో జరిగిన అవకతవకలతో పాటు ఇన్‌ఛార్జ్‌ల నియామకంలో వచ్చిన ఆరోపణలతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో ఇటీవల జరుగుతున్నఅక్రమాల నేపథ్యంలో ఆయన రాజీనామా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.