పునరావాస కేంద్రాన్ని సందర్శించిన తంగిరాల

పునరావాస కేంద్రాన్ని సందర్శించిన తంగిరాల

NTR: ఎగువ ప్రాంతాల నుంచి మున్నేరు వరద కొనసాగుతున్న ప్రవాహ నేపథ్యంలో, కీసర గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గురువారం సందర్శించారు. ఈ పునరావాస కేంద్రంలో గత మూడు రోజులుగా 87 మంది బాధితులు తలదాచుకుంటున్నట్లు అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. వారికి అందుతున్న వసతి, ఆహారం, వైద్య సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు.