VIDEO: ఉదృతంగా ప్రవహిస్తున్న ఎర్రవాగు

MLG: మంగపేట మండలం కమలాపురంలో సోమవారం ఎర్రవాగు వరద ఉద్ధృతికి పలు ఇళ్లు నీట మునిగాయి. కమలాపురం నుంచి ఏటూరునాగారం ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.