'మున్సిపల్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా'
కామారెడ్డి మున్సిపల్ అభివృద్ధిపై చర్చించేందుకు మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్లు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌ను కలిశారు. మున్సిపాలిటీకి భారీగా నిధులు మంజూరు చేయించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కామారెడ్డి అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు