VIDEO: చిరుజల్లులతో వర్షం
SRD; కంగ్టి మండలంలోని తడ్కల్‌తో పాటు పరిసర గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం జల్లులతో వర్షం కురిసింది. ఈ వర్షంతో వాతావరణం చల్లబడింది. అయితే చేతికొచ్చిన రబీ పంటలు దెబ్బతింటాయనే భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆకాశం మేఘావృతంగా కొనసాగుతుండటంతో మరికొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురిసే అవకాశముందని స్థానికులు భావిస్తున్నారు.