నేడు కనిగిరి మండలంలో పల్లె పండుగ

నేడు కనిగిరి మండలంలో పల్లె పండుగ

ప్రకాశం: కనిగిరి మండలంలో సోమవారం పల్లె పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ కార్యాలయ ప్రతినిధి తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఉదయం 10:30 గంటలకు మునుగోడు పంచాయితీలోనూ, 11 గంటలకు బొమ్మిరెడ్డి పల్లి, మధ్యాహ్నం 12:30 గంటలకు పేరువారిపల్లి పంచాయితీలలో అంతర్గత సీసీ రోడ్లకు శంఖుస్థాపన చేస్తారని చెప్పారు.