స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో శుక్రవారం జరిగే 79 స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ పరిశీలించారు. సభాస్థలి ఏర్పాటు, వీఐపీ గ్యాలరీ, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లపై సూచనలు చేశారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికలు నేపథ్యంలో తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలని మహేందర్ అన్నారు.