అంబులెన్స్‌కి దారి లేక మంచంపై వాగు దాటింపు

అంబులెన్స్‌కి దారి లేక మంచంపై వాగు దాటింపు

WGL : సంగెం మండలం ఎల్గుర్ రంగంపేటలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వడ్లకొండ పరశురాములు అనే వ్యక్తి మంగళవారం అనారోగ్యానికి గురయ్యాడు. అయితే కుటుంబ సభ్యులు అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించేందుకు యత్నించగా అండర్ బైపాస్‌లో వర్షపు నీటితో పూర్తిగా నిండిపోవడంతో సాధ్యపడలేదు. చేసేదేమీ లేక గ్రామస్తుల సహాయంతో మంచంపై అతడిని వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు.