100 కేజీల గంజాయి స్వాధీనం.. నిందితుడు అరెస్ట్

100 కేజీల గంజాయి స్వాధీనం.. నిందితుడు అరెస్ట్

కృష్ణా జిల్లాలో ఈగల్ టీమ్ ప్రత్యేక ఆపరేషన్ విజయవంతమైంది. గుట్టుచప్పుడు కాకుండా ఒడిశా నుంచి కారులో గంజాయి తరలిస్తున్న నిందితుడిని గన్నవరం మండలం దావాజీగూడెం వద్ద పోలీసులు బుధవారం పట్టుకున్నారు. కారులో తరలిస్తున్న 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి, గంజాయి రవాణాకు ఉపయోగించిన కారును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.