VIDEO: యోగాసన పోటీలకు ఎంపికైన ఉపాధ్యాయుడు

VIDEO: యోగాసన పోటీలకు ఎంపికైన ఉపాధ్యాయుడు

ప్రకాశం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రస్థాయి యోగా పోటీ జరిగాయి. ఈ పోటీలలో పెద్ద చెర్లోపల్లి మండలం వెంగలాయిపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్వర్ణ రమణయ్య తమ ప్రతిభను చాటుకున్నాడు. ఈ మేరకు రాష్ట్రస్థాయి యోగాసన పోటీలలో హ్యాండ్ బాలెన్స్ ఆసనాలతో సిల్వర్ మెడల్ (ద్వితీయ స్థానం) సాధించాడు.