రేపటి నుంచి జిల్లాలో ప్రత్యేక వైద్య శిబిరాలు: డీఎంహెచ్‌వో

రేపటి నుంచి జిల్లాలో ప్రత్యేక వైద్య శిబిరాలు: డీఎంహెచ్‌వో

SRPT: జిల్లాలో బుధవారం నుంచి ఈ నెల 31 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకట రమణ తెలిపారు. PHCల్లో గైనకాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, కంటి, పంటి నిపుణులు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 'ఆరోగ్య సూర్యాపేట' లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.