ధర్మవరం డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం

ధర్మవరం డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం

సత్యసాయి: ధర్మవరం కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ నెల 26వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. 28వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ఆగస్టు 31న సీట్ల కేటాయింపు చేసి, సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.