ఈ నెల 9న ANUలో హెటిరో డ్రగ్స్ క్యాంపస్ డ్రైవ్
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రాంగణ నియామకాలు నిర్వహించనున్నారు. ఈ నెల 9న కెమిస్ట్రీ విభాగంలో హెటిరో డ్రగ్స్ ఆధ్వర్యంలో డ్రైవ్ జరుగుతుంది. ఎమ్మెస్సీ, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మసీతో పాటు ఇంటర్, ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులు పాల్గొనవచ్చు. అభ్యర్థులు విద్యార్హత పత్రాలు, రెండు ఫొటోలు తీసుకురావాలని అధికారులు సూచించారు.