VIDEO: హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న జోగు రామన్న
ADB: ఆదిలాబాద్ పట్టణంలోని చించర్ వాడ కాలనీలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. బుధవారం సాయంత్రం ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి పట్టణంలోని పలు వీధుల్లో ఊరేగించారు. డీజే చప్పుళ్లు, హనుమాన్ నామ స్మరణతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ శోభాయాత్రలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.