మఠంపల్లి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ కష్టాలు

మఠంపల్లి  ప్రధాన రహదారిపై ట్రాఫిక్ కష్టాలు

SRPT: మఠంపల్లి మండల ప్రధాన రహదారిపై ఉన్న యూనియన్ బ్యాంక్ వద్ద పార్కింగ్ సమస్య తీవ్రంగా మారింది. బ్యాంక్‌కి వచ్చే వినియోగదారులు, షాపులకు వచ్చే ప్రజలు రోడ్డుపై బైకులు నిలిపివేయడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ప్రత్యేక పార్కింగ్ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతుండగా, స్థానికులు బ్యాంకు అధికారులు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.