నేడు జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిపివేత

కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బిళ్లకుర్రు సబ్ స్టేషన్ పరిధిలోని 11 కేవీ అవిడి ఫీడర్ మరమ్మతు పనుల కారణంగా వానపల్లి గ్రామంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు ఏఈ కె. రాంబాబు తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.