పదవుల కోసం BRS లోకి వెళ్లట్లేదు: జీవన్ రెడ్డి
SDPT: పదవుల కోసం BRSలో చేరాల్సి ఉంటే ఎప్పుడో వెళ్లేవాడినని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రజల హక్కుల కోసం, వారి సమస్యలపై పోరాడేందుకే తాను గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజా సంక్షేమమే తన అంతిమ లక్ష్యమని, ఆయన పేర్కొన్నారు.