పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్
ELR: నిడమర్రు మండలం మందలపర్రు శివారులో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అదుపులో తీసుకుని రూ.11,670 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రమేష్ శుక్రవారం తెలిపారు. మండలంలో ఎవరైనా పేకాట, కోడిపందాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.