ఇంటర్ బాలికపై వేధింపులు.. నలుగురిపై కేసు నమోదు
కోనసీమ: పి.గన్నవరం మండలంలో ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన నలుగురిపై మంగళవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై శివ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 20న నిందితులు బాలిక సైకిల్‌ను దాచిపెట్టి ఆమెను వేధించినట్లు తెలిపారు. నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ఇద్దరు మైనర్లు ఉన్నారన్నారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.