విచ్చలవిడిగా రూ.35 కోట్ల దుబారా

కృష్ణా: అద్విక ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకుడు ఆదిత్య కేసు దర్యాప్తులో పోలీసులు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి తెస్తున్నారు. డిపాజిటర్లను ఆకర్షించేందుకు రూ.35 కోట్లకుపైగా పలు ఉత్సవాలు, పుట్టినరోజు వేడుకలు, ఖరీదైన హోటల్ రూమ్‌లలో బస ఏర్పాట్లు, టూర్‌లను కంపెనీ నిర్వాహకులు చేపట్టినట్లు తెలుస్తోంది. 11 మంది కంపెనీ డైరెక్టర్‌లకు విల్లాలు కట్టడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు.