ఘనంగా పైల 16వ వర్ధంతి

ఘనంగా పైల 16వ వర్ధంతి

SKLM: అసమానతలు ఉన్న సమాజంలో ఉద్యమాలు అనివార్యంగా వస్తాయని ఉద్యమాల్ని ఆపడం ఎవరి తరం కాదని సీపీఐ న్యూడెమోక్రసీ జిల్లా సహయ కార్యదర్శి వంకల మాధవరావు అన్నారు. శనివారం పైల వాసుదేవరావు 16వ వర్ధంతి సందర్భంగా వజ్రపు కొత్తూరులో ఆయన స్తూపం వద్ద సభ నిర్వహించారు. అమరవీరుల స్మారక స్థూపానికి అతని సోదరుడు పైల రామారావు నివాళులర్పించారు.