అల్లు సినిమాస్ 'వాల్ ఆఫ్ ఫేమ్' వివాదం

అల్లు సినిమాస్ 'వాల్ ఆఫ్ ఫేమ్' వివాదం

హైదరాబాద్ కోకాపేటలోని 'అల్లు సినిమాస్' వాల్ ఆఫ్ ఫేమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. రాజమౌళి, సుకుమార్ వంటి దిగ్గజాల ఫొటోలు పెట్టి.. భారతీయ సినిమా గమనాన్ని మార్చిన రామ్ గోపాల్ వర్మ, భారీ చిత్రాల దర్శకుడు శంకర్, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫొటోలను విస్మరించడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కావాలని చేశారా..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.