VIDEO: వర్ధన్నపేటలో ఆసుపత్రి కోసం స్వచ్ఛంద బంద్
WGL: వర్ధన్నపేట పట్టణంలో వంద పడకల ఆసుపత్రి సాధన సమితి పిలుపుతో శనివారం వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. బంద్‌కు పట్టణవ్యాప్తంగా మంచి స్పందన కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, బంద్ పేరుతో బలవంతంగా దుకాణాలు మూసివేయిస్తే సాధన సమితి నేతలపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసు బందోబస్తు పెంచారు.