రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల వేదిక
తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారన్నారు. అర్జీదారులు తమ సమస్యలకు సంబంధించిన పత్రాలతో పాటు పాత రసీదులు తీసుకురావాలని సూచించారు.